క్రికెట్ లో టీమిండియా అగ్రశ్రేణి జట్టు కాగా, ఫుట్‌బాల్ ప్రపంచంలో టాప్ టీమ్ మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్. ఈ రెండు క్రీడా జట్లు చిరస్మరణీయం అనదగ్గ రీతిలో మాంచెస్టర్‌లో ఒకే వేదికపై కలిశాయి. ఈ సందర్భంగా రెండు జట్ల స్టార్ ఆటగాళ్లు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం అభిమానులకు ఉత్సాహాన్ని కలిగించింది.ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ కోసం మాంచెస్టర్‌లో ఉన్న భారత క్రికెట్ టీమ్ ఆటగాళ్లు, మాంచెస్టర్ యునైటెడ్ ఆటగాళ్లతో కలిసి ఒక ఫోటోషూట్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం క్రికెట్ మరియు ఫుట్‌బాల్ అభిమానులకు ఒక అరుదైన క్షణంగా నిలిచింది. ఈ సందర్భంగా రెండు జట్ల ఆటగాళ్లు పరస్పరం అనుభవాలను పంచుకున్నారు. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి. అభిమానులు ఈ ఐకానిక్ కలయికను "క్రికెట్ మీట్స్ ఫుట్‌బాల్" అంటూ ఉత్సాహంగా సెలబ్రేట్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa