మూడున్నర కోట్లకు పైగా ఉద్యోగాలను సృష్టించడమే ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకం(ఈఎల్‌ఐ) లక్ష్యమని ఉద్యోగుల భవిష్య నిధి, ఆదాయపన్ను శాఖలసీనియర్ అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 2024-25 బడ్జెట్‌లో ప్రకటించిన ఈ పథకం గురించి రాష్ట్ర పరిశ్రమల సమాఖ్య (ఏపీ ఛాంబర్స్) గురువారం విజయవాడలో అవగాహన సదస్సు నిర్వహించింది. ఏపీ ఛాంబర్స్ అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో సెంట్రల్ పీఎఫ్ అదనపు కమిషనర్ పి.వీరభద్రస్వామి, రీజినల్ పీఎఫ్ కమిషనర్లు హెమోంగ్ వెంకటేష్, ప్రభుదత్త పృష్టీ, అబ్దుల్ ఖాదర్, ఆదాయపన్నుశాఖ (టీడీఎస్) అధికారి పి.అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa