యూట్యూబ్ చూసి మూడు నెలలుగా ఫ్రూట్ జ్యూస్ డైట్ చేస్తూ ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. శక్తీశ్వరన్ అనే యువకుడు బరువు తగ్గడానికి రోజు జ్యూస్‌లు తాగేవాడని, డైట్ పాటించే ముందు వైద్యులను సంప్రదించలేదని వెల్లడించారు. ఈ క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురై ఊపిరాడక మృతి చెందాడని వారు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa