ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"అతని కోసం మా కొడుకును పక్కన పెట్టారు" – అభిమన్యు ఈశ్వరన్ తండ్రి ఆరోపణ

sports |  Suryaa Desk  | Published : Thu, Jul 31, 2025, 11:31 PM

టీమిండియా మేనేజ్‌మెంట్ తీరుపై యువ క్రికెటర్ అభిమన్యు ఈశ్వరన్ తండ్రి రంగనాథన్ ఈశ్వరన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కరుణ్ నాయర్‌కి స్థానం కల్పించడంలో, తన కొడుకు హక్కు కోల్పోయాడని ఆరోపించారు.ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైనప్పటికీ అభిమన్యు ఈశ్వరన్‌కు ఒక్క టెస్ట్ మ్యాచ్‌ లోనూ అవకాశమివ్వకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఓవల్ వేదికగా ప్రారంభమైన ఆఖరి టెస్ట్‌ మ్యాచ్‌లోనూ ఎంపికదారులు అభిమన్యును పక్కనబెట్టడం ఆయనను తీవ్ర నిరాశకు గురిచేసింది. తొలి మూడు టెస్టుల్లో కరుణ్ నాయర్ పరవాలేదు కానీ నాలుగో టెస్టులో కూడా అతనికే మరోసారి ఛాన్స్ ఇవ్వడాన్ని ఆయన ప్రశ్నించారు.2022లో బంగ్లాదేశ్ పర్యటన నాటినుంచి టెస్ట్ అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్న అభిమన్యు, ఈ పర్యటనలోనూ బెంచ్‌కే పరిమితమయ్యాడు. గతంలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కూడా అతనికి తుది జట్టులో చోటు దక్కలేదు.రంగనాథన్ మాట్లాడుతూ, "నేను రోజులు కాదు.. సంవత్సరాలుగా గడిపేస్తున్నాను. అభిమన్యు నాలుగేళ్లుగా టెస్ట్ అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్నాడు. అతను దేశవాళీ క్రికెట్‌లో స్థిరంగా రాణిస్తున్నా సెలెక్టర్లు అవకాశం ఇవ్వడం లేదు. కరుణ్ నాయర్ గతేడాది దులీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీల్లో ఆడలేదు. కానీ అతనికి మళ్లీ ఛాన్స్ ఇచ్చారు.ఇదే సమయంలో అభిమన్యు గత సీజన్‌లో 864 పరుగులు చేశాడు" అని వివరించారు.ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా సెలెక్షన్ అన్యాయం"కొందరు ఆటగాళ్లను ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా టెస్ట్ జట్టులోకి తీసుకోవడం తప్పు. టెస్ట్ క్రికెట్ ఎంపికలు రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీల ప్రదర్శనల ఆధారంగా మాత్రమే జరగాలి" అంటూ అభిప్రాయపడ్డారు.2022లో భారత జట్టు పిలుపు అందుకున్న అభిమన్యు ఈశ్వరన్ ఇప్పటివరకు 103 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 7841 పరుగులు చేశాడు. ఆయన సగటు 48.70 కాగా, ఇందులో 27 శతకాలు, 31 అర్ధశతకాలు ఉన్నాయి. ఇటీవలే దేశవాళీ సీజన్‌లో 127*, 191, 200*, 157* లాంటి అద్భుత స్కోర్లు సాధించాడు.తన కొడుకు పట్ల జరిగిందంతా అన్యాయం అనే భావనతో రంగనాథన్ ఈశ్వరన్ చెప్పిన ఈ వ్యాఖ్యలు, టీమిండియా ఎంపిక విధానాలపై పలు ప్రశ్నలను ఎత్తి చూపుతున్నాయి.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa