ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్ క్రికెట్‌లో కలకలం: హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌ జగన్మోహన్‌రావు సస్పెన్షన్

sports |  Suryaa Desk  | Published : Thu, Jul 31, 2025, 11:36 PM

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) లో మళ్లీ కలకలం రేగింది. అపెక్స్ కౌన్సిల్ కీలకంగా స్పందిస్తూ హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌రావును సస్పెండ్ చేసినట్టు సమాచారం. ఈ నిర్ణయం అసోసియేషన్‌లో జరుగుతున్న అంతర్గత విభేదాల ఫలితంగా తీసుకున్నట్లు భావిస్తున్నారు. అధికార దుర్వినియోగం, పాలనపై అసంతృప్తి వంటి అంశాల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్టు అపెక్స్ కౌన్సిల్ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది.ఇప్పటికే జగన్మోహన్‌రావు, దేవరాజ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ నేపథ్యంలో వారిని సస్పెండ్ చేస్తూ అపెక్స్‌ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa