AP: విజయనగరం జిల్లా రాజాంలో మంగళవారం షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. గాయత్రీ కాలనీలో ఓ వ్యక్తికి చెందిన పెంపుడు కుక్క తరచూ పక్కింటికి వెళ్లి మలవిసర్జన చేస్తుండేది. ఈ క్రమంలో సోమవారం రాత్రి కూడా ఇదే విధంగా చేయడంతో పక్కింటివారు కుక్క యజమానిని నిలదీశారు. దీంతో ఇరు కుటుంబాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో కుక్క యజమాని బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa