ఉత్తరాఖండ్ ఉత్తరకాశీలోని ధరాలీలో క్లౌడ్ బరస్ట్ కారణంగా మెరుపు వరదలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో గ్రామంలోని సుమారు 20-25 హోటళ్లు, పలు నివాసాలు కొట్టుకుపోయి ఉండొచ్చని స్థానికులు పేర్కొంటున్నారు. చాలా వరకు ఇళ్లు కుప్పకూలిపోగా మిగిలినవి శిథిలాల్లో కూరుకుపోయాయి. శిథిలాల కింద చాలా మంది సజీవ సమాధి అయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రకృతి విలయానికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa