ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్ ధామీతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ఉత్తరకాశీలోని ధరాలీలో వరద పరిస్థితులపై మోదీ ఆరా తీశారు. ఈ విషాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రధాని తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడివారు త్వరగా కోలుకోవాలని మోదీ ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో సహాయక బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తున్నాయని ఎక్స్ వేదికగా మోదీ పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa