హిమాచల్‌ప్రదేశ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 396 రహదారులను అధికారులు మూసివేశారు. పలు జిల్లాల్లో పరిస్థితి విషమంగా ఉండటంతో యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రమాదకర ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచనలు జారీ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa