Honor X7c 5G స్మార్ట్‌ఫోన్ very soon భారత మార్కెట్‌లోకి రాబోతోంది. ప్రముఖ మొబైల్ బ్రాండ్ హానర్ తమ కొత్త 5G డివైస్‌ను ఈ నెల ఆగస్టు 18న విడుదల చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ఇప్పటికే అక్టోబర్ 2024లో కొన్ని అంతర్జాతీయ మార్కెట్లలో లాంచ్ అయిన ఈ ఫోన్, ఇప్పుడు భారత వినియోగదారుల కోసం ప్రత్యేకంగా కొన్ని మార్పులతో వస్తోంది. Amazon ద్వారా ఈ ఫోన్ ఎక్స్‌క్లూజివ్‌గా అందుబాటులోకి రానుంది.ఈ డివైస్‌లో Qualcomm Snapdragon 4 Gen 2 (4nm) చిప్‌సెట్ వినియోగించబడింది, ఇది మిడ్రేంజ్ పనితీరు కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. 6.8 అంగుళాల Full HD+ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తోంది, ఇది గేమింగ్ మరియు వీడియో స్ట్రీమింగ్‌కు చక్కటి అనుభూతిని అందించనుంది. కెమెరా సెగ్మెంట్‌లో, ఈ ఫోన్ 50MP ప్రైమరీ రియర్ కెమెరాతో పాటు 2MP డెప్త్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది, ముందు భాగంలో 5MP సెల్ఫీ కెమెరా ఉంటుంది.బ్యాటరీ పరంగా, 5,200 mAh కెపాసిటీతో పాటు 35W Honor SuperCharge సపోర్ట్ అందించబడుతుంది. డివైస్‌లో 8GB RAM + 8GB వర్చువల్ RAM మరియు 256GB UFS 3.1 ఇంటర్నల్ స్టోరేజ్ ఇవ్వబడుతుంది. IP64 రేటింగ్, SGS drop-resistance సర్టిఫికేషన్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, 300% హై వాల్యూమ్ మోడ్ వంటి ఫీచర్లు దీనికి అదనపు ఆకర్షణగా నిలుస్తాయి.ఈ ఫోన్‌లో తాజా Android 15 ఆధారిత MagicOS 8.0 ఇంటర్‌ఫేస్ ముందస్తుగా ఇన్‌స్టాల్ అయి వస్తుంది. రంగుల పరంగా, Forest Green మరియు Moonlight White అనే రెండు ఆకర్షణీయమైన వేరియంట్లలో ఈ ఫోన్ లభ్యం కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa