AP: కర్నూలు జిల్లాలోని మద్దికేర మండలంలో ఓ భార్య ఆస్తి కోసం తన భర్తను దారుణంగా హతమార్చింది. వెంకటేష్, సరస్వతి భార్య భర్తలు. అయితే ఆస్తి విషయంలో వీరి మధ్య తరచూ గొడవలు జరిగివే. ఈ క్రమంలోనే ఆమె మూడు రోజుల ముందు భర్తను హత్య చేసి పరారైంది. ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో గ్రామస్తులు వెళ్లి చూశారు. వెంకటేష్ విగతజీవిగా పడి ఉండటంతో షాకయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అయితే సరస్వతి పోలీసులకు లొంగిపోయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa