AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలో రానున్న 4 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఈ మేరకు అల్లూరి సీతారామరాజు, ఏలూరు, NTR జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. అటు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, కోనసీమ, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పదనున్నాయంది. భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa