AP: తిరుపతి టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై దర్యాప్తు చేయాలని సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి శుక్రవారం లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. 2014-2019 మధ్యకాలంలో వందల కోట్ల టీడీఆర్ కుంభకోణం జరిగిందని తెలిపారు. బాండ్ల స్కామ్‌లో మోసం, అవినీతి గురించి అనేక ఆరోపణలు వెలుగులోకి వచ్చాయన్నారు. టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa