AP: వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఒడిశా పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో రుతుపవనాల ద్రోణి కొనసాగుతోంది. దీంతో ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అల్పపీడన ప్రభావం రెండు రోజుల పాటు కొనసాగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa