AP: పన్ను వ్యవస్థను సులభతరం చేయడం కోసం జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైందని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. జీఎస్టీ శ్లాబుల సరళీకరణ.. పర్యాటక, సినిమా రంగాలకు ఊతమందిస్తుందని చెప్పారు. ఈ సంస్కరణలతో తక్కువ ధరల్లోనే వినోదం లభించనుందన్నారు. బడ్జెట్ ట్రావెలర్, దేశీయ టూరిజానికి ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు. 18 శాతం శ్లాబ్ పరిధిలోకి సినిమా ప్రొడక్షన్ సేవలు తేవడం వల్ల నిర్మాతలకు మేలు జరుగుతుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa