ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ భారీ బహిరంగ సభని విజయవంతం చేద్దాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 06, 2025, 02:50 PM

గత 44 ఏళ్లలో తొలిసారి అనంతపురంలో టీడీపీ భారీ బహిరంగ సభ జరగబోతుందని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ అభిప్రాయపడ్డారు. అనంతపురంలో సూపర్‌ సిక్స్‌ సూపర్‌ హిట్‌ సభ నిర్వహించనున్నట్లు తెలిపిన అయన , ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మనపై పెట్టిన బాధ్యతను విజయవంతంగా నిర్వహించాలన్నారు. 3.5 లక్షల మంది సభకు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. అలానే టీడీపీ జోన్‌-5 ఇన్‌చార్జ్‌, గుంటూరు మేయర్‌ కోవెలమూడి రవీంద్ర మాట్లాడుతూ ఎన్నికల ముందు కష్టపడి కూటమిని గెలిపించారని, ఇప్పుడు ఈ విజయోత్సవ సభను సైతం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa