చంద్రగ్రహణం ముగిసిన అనంతరం తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రముఖ ఆలయాలు తిరిగి భక్తుల దర్శనార్థం తెరుచుకున్నాయి. చంద్రగ్రహణం ముందు ఆలయాలు మూసివేయడం, శుద్ధి అనంతరం మాత్రమే తిరిగి తెరవడం హిందూ సంప్రదాయంలో ఒక ముఖ్యమైన ఆచారం. ఈ నేపథ్యంలో అన్ని ఆలయాల్లోనూ సంప్రదాయ పద్ధతిలో శుద్ధి, సంప్రోక్షణలు నిర్వహించి భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతించారు.తిరుమలలో శ్రీవారి ఆలయం వేకువ జామున 2:40 గంటలకు పునఃప్రారంభమైంది. ఆలయాన్ని శుద్ధి చేసిన అనంతరం అర్చకులు ఏకాంతంగా సుప్రభాత సేవ నిర్వహించారు. భక్తుల రద్దీ కారణంగా టోకెన్లు లేని సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం 18 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa