తిరుపతి-శిరిడీ రైలును రెగ్యులర్ చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇకపై ఈ రైలు సర్వీసును రోజూ నడపాలని ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం సోమవారం అంగీకారం తెలిపింది. ఇప్పటి వరకు తాత్కాలికంగా నడుస్తున్న తిరుపతి-శిరిడీ మధ్య 07637/07638 నంబర్ రైలును ఇకపై రోజూ నడపనున్నట్లు వెల్లడించింది. రేణిగుంట, ధర్మవరం, రాయచూర్, షోలాపూర్, దౌండ్ మీదుగా ఈ రైలు శిరిడీ వెళ్లనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa