ఆమదాలవలస పట్టణంలోని డాబాలవారివీధిలో నివాసముంటున్న గూడాడ ఉపేంద్ర (27) అనే యువకుడు సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ సనపల బాలరాజు వివరాల మేర కు.. మండలంలోని మునగలవలసకు చెందిన ఉపేంద్ర సరుబుజ్జిలి మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహితతో కలిసి డాబాలవారివీధిలోని ఓ ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఉపేంద్ర శ్రీకాకుళంలోని ఓ జిరాక్స్ షాప్‌లో పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం తన ఇంటిలో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడి తల్లి పార్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బాలరాజు ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa