అన్నప్రసాదాలకు కూరగాయలు విరాళంగా టీటీడీకి అందజేస్తున్న దాతలతో ఒక వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సూచించారు. కూరగాలయ దాతలతో బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇటీవల అన్నప్రసాద విస్తరణ చేసిన నేపథ్యంలో దాతలు మరింత ముందుకు వచ్చి సహకరించాలని కోరారు. ప్రస్తుతం దాతలు రోజుకు 25 రకాల కూరగాయలు, 6 నుంచి 7 టన్నులు అందజేస్తున్నారని, బ్రహ్మోత్సవాల సమయంలో రోజుకు 10 టన్నులు అవసరముంటుందని అన్నప్రసాదం డిప్యూటీ ఈవో రాజేంద్రకుమార్, క్యాటరింగ్ ఆఫీసర్ శాస్ర్తి వివరించారు. కూరగాయల విరాళాలు 2022లో 5.79 శాతం నుంచి 2025లో దాదాపు 7 శాతానికి పెరిగాయని తెలిపారు. తమిళనాడు, కర్ణాటక, ఏపీకి చెందిన కూరగాలయ దాతలను వెంకయ్య చౌదరి శ్రీవారిప్రసాదాలతో సత్కరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa