శ్రీకాకుళంలో బుధవారం ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ, మధ్యాహ్నం ఆకస్మికంగా వర్షం కురిసింది. ఈ వర్షం నగర ప్రజలకు ఉపశమనాన్ని కలిగించింది. పలు చోట్ల రోడ్లు జలమయమయ్యాయి, లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. ఆకస్మిక వర్షంతో పాదచారులు ఇబ్బందులు పడ్డారు. అయితే, నగర శివారు ప్రాంతాల ప్రజలు ఈ వర్షం ఖరీఫ్ నాట్లు వేయడానికి మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa