నేపాల్‌లోని కాఠ్మండూ, ఇతర నగరాల్లో విధించిన కర్ఫ్యూతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి, పగటిపూట అమలులో ఉన్న ఈ కర్ఫ్యూ కారణంగా దుకాణాలు, వ్యాపారాలు మూతపడ్డాయి. వైద్య, పోలీసు, అగ్నిమాపక సేవలు మినహా అన్ని కార్యకలాపాలు నిలిచిపోయాయి. మార్కెట్లు, రవాణా స్తంభించిపోవడంతో నిత్యావసరాల కోసం సామాన్యులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ, హింసను అదుపు చేయడంలో కర్ఫ్యూ కొంతవరకు సఫలమైందని అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa