దసరా బంపర్: చర్లపల్లి - అనకాపల్లి స్పెషల్ రైళ్లు ప్రకటించిన రైల్వే శా దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీకి గాను దక్షిణ మధ్య రైల్వే ఒక మంచి నిర్ణయం తీసుకుంది. చర్లపల్లి - అనకాపల్లి మధ్య ప్రత్యేక రైలు సర్వీసులు నడపనున్నట్లు ప్రకటించింది. పండుగ సీజన్‌లో ప్రయాణం సౌకర్యంగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.ఈ ప్రత్యేక రైళ్లు సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 5 వరకు, ప్రతి శనివారం మరియు ఆదివారాల్లో నడవనున్నాయి. మొత్తం ఎనిమిది స్పెషల్ ట్రైన్లు ఈ రెండు నగరాల మధ్య ప్రయాణిస్తాయని అధికారులు వెల్లడించారు. అయితే, రైళ్ల బయలుదేరు సమయాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది.
*స్పెషల్ రైళ్లు, నడిచే తేదీలు & కోచ్ వివరాలు:
-చర్లపల్లి → అనకాపల్లి (రైలు నెం. 07035)
ప్రతి శనివారం, సెప్టెంబర్ 13 నుండి అక్టోబర్ 4 వరకు నడుస్తుంది.
-అనకాపల్లి → చర్లపల్లి (రైలు నెం. 07036)
ప్రతి ఆదివారం, సెప్టెంబర్ 14 నుండి అక్టోబర్ 5 వరకు అందుబాటులో ఉంటుంది.
-ఈ రైళ్లలో ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని తరగతుల కోచ్‌లు ఉంటాయి:
ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్, అలాగే జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి.
ఈ రెండు ప్రత్యేక రైళ్లు ఇరువైపులా క్రింది స్టేషన్లలో ఆగుతాయి: జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, రాయనపాడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, ఎలమంచిలి ఈ ప్రయాణ మార్గాన్ని ఉపయోగించుకునే వారికీ ఇది విశేషంగా ఉపయోగపడే అవకాశం ఉంది. ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకొని ప్రయాణాన్ని సురక్షితంగా ప్లాన్ చేసుకోవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa