AP: రాష్ట్ర రైతుల అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం 25,894 టన్నుల యూరియా కేటాయించింది. ఈ నెల 15 నుంచి 22వ తేదీలోగా విశాఖపట్నం పోర్టుకు యూరియా చేరుకుంటుంది. ఈ విషయాన్ని గురువారం రాత్రి మంత్రి అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు చొరవతోనే రాష్ట్రానికి యూరియా వస్తోందని వివరించారు. ఈ మేరకు కేంద్రానికి మంత్రి అచ్చెన్నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa