AP: విశాఖలోని గాజువాక సమీపంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగ్గు జంక్షన్ వద్ద నడుచుకుంటూ వెళ్తున్న మహిళను స్టీల్ ప్లాంట్ నుంచి వస్తున్న ఓ వాహనం ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు చిన్నగంట్యాడకు చెందిన విజయలక్ష్మిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa