మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో కోతుల గుంపులో ఓ కోతి తన రౌడీయిజంతో ప్రజలను కలవరపెట్టింది. ఈ కోతి ఇతర కోతులకు నేతగా వ్యవహరిస్తూ, ముందుండి భక్తులు, గ్రామస్తుల్ని వెంటాడుతూ కరిచేసే స్థాయికి వెళ్లింది. దీంతో ఆలయానికి వచ్చే భక్తులు, గ్రామస్థులు భయబ్రాంతులకు లోనయ్యారు.
ఈ రౌడీ కోతిని పట్టుకోవడానికి కోతులు పట్టే నిపుణుడు మురుగన్ తన భార్య రేణుకతో కలిసి రంగంలోకి దిగాడు. వారు ఏర్పాటు చేసిన బోనులో కోతిని పడేయడానికి ముప్పుతిప్పలు పడ్డారు. చివరికి ఆదివారం ఆ కోతి బోనులో చిక్కడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఈ కోతి పట్టుబడటంతో గ్రామంలో జనం ఊరట పీల్చారు. చాలాకాలంగా ఈ కోతి తిప్పలు పెడుతూ ఉండటంతో గ్రామస్థులు భయంతో జీవిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో తిరిగే భక్తులకూ ఈ కోతి ముప్పుగా మారింది.
ఇప్పటికే 128 కోతులను పట్టు బడి ఇతర అడవిలో వదిలేశారు. ఈ రౌడీ కోతి కూడా వాటిలో చేరనుంది. అధికారులు ఇంకా మిగిలిన కోతులకూ బోనులు వేస్తూ గ్రామస్థులకు భద్రత కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa