సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పరిధిలోని విద్యార్థులకు బోర్డు కీలకమైన నిబంధనను అమల్లోకి తెచ్చింది. ఇకపై వార్షిక పరీక్షలకు హాజరు కావాలంటే విద్యార్థులకు కనీసం 75 శాతం అటెండెన్స్ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది. ఈ మేరకు తీసుకున్న తాజా నిర్ణయాన్ని అధికారులు వెల్లడించారు.ఇటీవల సీబీఎస్ఈ ఫలితాల వెల్లడికి 'ఇంటర్నేషనల్ అసైన్‌మెంట్'ను తప్పనిసరి చేసింది. అయితే, తరగతులకు సరిగా హాజరుకాని విద్యార్థులు ఈ అసైన్‌మెంట్లను పూర్తి చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు బోర్డు గుర్తించింది. ఈ నేపథ్యంలో, విద్యార్థులు అసైన్‌మెంట్లను సమర్థంగా పూర్తి చేయాలంటే వారికి తగినంత హాజరు శాతం ఉండటం అవసరమని భావించింది. అందుకే, ప్రతి విద్యార్థికి 75 శాతం అటెండెన్స్ నిబంధనను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించినట్లు సీబీఎస్ఈ తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa