ఉపవాసం చేసినప్పుడు ఎవరైనా భక్తి శ్రద్ధలతో చేయాలి. అంతేకానీ, ఇబ్బందిగా చేయకూడదు. సరిగ్గా చేస్తేనే ఆ దేవుడిని సరిగ్గా పూజించగలం. ముఖ్యంగా ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సరైన ఫుడ్స్ మాత్రమే తీసుకోవాలి. డ్రింక్స్ కూడా ఏవి పడితే అవే తాగకూడదు. దీని వల్ల కడుపులో గ్యాస్ పేరుకుపోయి ఉబ్బరంగా, అసిడిటీగా అనిపిస్తుంది. వీటిని ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా సమస్య పెరుగుతుంది. అలానే ఉండిపోతుంది. అలా జరగకుండా ఉండాలంటే ఏ ఫుడ్ తినాలి. ఏ డ్రింక్స్ తాగాలో పూర్తిగా తెలుసుకోవాలి. కొన్నింటిని అవాయిడ్ చేయాలి. మరికొన్నింటిని యాడ్ చేసుకోవాలి. పూజల టైమ్‌లోనే కాదు, నార్మల్‌గా ఉపవాసం ఉన్నప్పుడు కూడా వీటిని ఫాలో అవ్వాలి. దీంతో ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండానే హ్యాపీగా ఫాస్టింగ్ చేయొచ్చు. కొన్ని మిస్టేక్స్ అవాయిడ్ చేస్తేనే చాలా మంచిది. అవేంటో తెలుసుకోండి.
ఫ్రైడ్ ఫుడ్స్
మామూలు సమయాల్లోనే నూనెలో ఫ్రై చేసి పూరీలు, పకోడీలు, బజ్జీలు, చిప్స్ వంటివి కడుపులో అసిడిటీకి కారణమవుతాయి. వీటిని నూనెలో ఫ్రై చేస్తారు. కాబట్టి, వీటిని తినడం వల్ల త్వరగా జీర్ణమవ్వవు. పైగా గ్యాస్, అసిడిటీకి కారణమవుతాయి. వీటి బదులు ఉడికించినవి, కాల్చినవి, లో ఫ్యాట్ ఫుడ్స్, కిచిడీ, పెరుగు వంటి ఫుడ్స్ తీసుకోండి. పండ్లు కూడా తీసుకోవచ్చు. వీటి వల్ల ఎలాంటి సమస్యలు రావు.
ఖాళీ కడుపుతో
ఉపవాసం ఉన్నప్పుడు ఖాళీ కడుపుతో టీ, కాఫీలు తీసుకోవడాన్ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే, టీ, కాఫీలోని కెఫిన్ కడుపులోని అసిడిటీని పెంచుతుంది. దీని కారణంగా అసిడిటీ, గుండెల్లో మంట పెరుగుతుంది. వీటి బదులు మీరు నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరినీరు వంటివి తీసుకోవచ్చు. ఇవే కాకుండా ఏవైనా తిన్న తర్వాత పంచదార కలపని జ్యూస్‌లు తీసుకోండి.
నీరు ఎక్కువగా తాగడం
ఫాస్టింగ్ టైమ్‌లో ఎక్కువగా నీరు తాగరు. ఈ కారణంగా డీహైడ్రేట్ అవ్వడమే కాదు, మలబద్ధకం, అసిడిటీలు పెరుగుతాయి. కాబట్టి, కడుపునిండా నీరు తాగండి. వీటితో పాటు దోసకాయలు, పుచ్చకాయలు, ముల్లంగా వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు కూడా తీసుకోవచ్చు. హెల్దీగా హెర్బల్ టీలు కూడా తీసుకోవచ్చు. దీంతో కూడా బాడీ హైడ్రేట్‌గా ఉంటుంది. అసిడిటీ సమస్యలు కూడా రావు.
సిట్రస్ పండ్లు
ఫాస్టింగ్ టైమ్‌లో చాలా మంది పండ్లు తినమంటారు. అయితే, అవి నార్మల్ పండ్లు తినాలి. సిట్రస్ పండ్లలాంటివి తగ్గించాలి. వీటి కారణంగా అసిడిటీ మరింత పెరుగుతుంది. వీలైనంతగా సిట్రస్ ఫ్రూట్స్‌ని అవాయిడ్ చేసి వాటి బదులు అరటిపండ్లు, బొప్పాయి, ఆపిల్స్ వంటివి తినొచ్చు. వీటిలోని కార్బోహైడ్రేట్స్ కారణంగా చాలా వరకూ ఎనర్జీగా ఉండేలా చేస్తాయి కూడా.
ఎక్కువసేపు ఖాళీ కడుపుతో ఉండడం
కొంతమంది ఫాస్టింగ్ ఉన్నప్పుడు సాయంత్రం వరకూ ఏం తినరు. దీంతో అసిడిటీ పెరుగుతుంది. గ్యాస్ అనిపిస్తుంది. అలా కాకుండా, స్నాక్స్ తీసుకోండి. నానబెట్టిన బాదం, వాల్నట్స్, అరటిపండ్లు తినండి. రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. అంతేకాకుండా, ఓట్స్, చియా పుడ్డింగ్ వంటివి కూడా తీసుకోవచ్చు. లేదంటే మీకు నచ్చితే ఏదైనా లైట్‌గా స్నాక్స్ తీసుకోండి.
వీటితొ పాటు
ఉదయం నానబెట్టిన నట్స్ తినొచ్చు. అరటిపండు తినండి. గోరువెచ్చని నీరు తీసుకోండి.
రోజు మొత్తం పండ్లు, పెరుగు, మజ్జిగ తినండి.
సాయంత్రం మఖానా లేదా కాల్చిన వేరుశనగ వంటి లైట్ స్నాక్స్ తీసుకోండి.
రాత్రి టైమ్‌లో కొన్నికూరగాయలు, రోటీ, పాలు తీసుకోండి.
నెమ్మదిగా తినండి.
తిన్న ఆహారాన్ని నిదానంగా నమలండి.
ఇలా చేయొద్దు
స్వీట్స్, పంచదారతో చేసిన తీపి వంటకాలు తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలొస్తాయి. ఒకవేళ తిన్నా ఎక్కువగా తినొద్దు.
కొంతమంది రోజంతా ఫాస్టింగ్ ఉండి ఎక్కువగా తింటారు. అలా తినకండి. కొద్దిగా తీసుకోండి. పోర్షన్ కంట్రోల్ ముఖ్యం. అదే విధంగా, రాత్రుళ్లు లేట్‌గా తినొద్దు. ముందుగానే తిని రెస్ట్ తీసుకోండి. దీంతో పడుకునే టైమ్‌కి తిన్న ఆహారం జీర్ణమవుతుంది.
తిన్న వెంటనే పడుకోవద్దు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa