టీలు అంటే చాలా మందికి ఇష్టమే అవి తాగడం అన్నీ వేళలా మంచి కావు. అన్నీ టీలు ఆరోగ్యానికి హాని చేయవు. కొన్ని హెల్దీ హెర్బల్ డ్రింక్స్ ఉటాయి. అందులో ఔషధ గుణాలు ఉంటాయి. అవే హెర్బల్ టీలు. వీటిని తాగడం వల్ల మీకు కేలరీలు తీసుకుంటున్నామన్న టెన్షన్ ఉండదు. బరువు పెరుగుతామన్న బెంగ ఉండదు. హాయిగా వీటిని తాగితే టీ తాగామన్న సంతృప్తితో పాటు బరువు కూడా తగ్గుతారు. సైంటిస్టుల ప్రకారం కొన్ని హెర్బల్ డ్రింక్స్ బరువుని ఈజీగా తగ్గిస్తాయి. వీటిని తాగడం వల్ల రిజల్ట్ ఉన్నప్పటికీ వీటితో పాటు డైట్ కంట్రోల్, కొద్దిపాటు వర్కౌట్, ఒత్తిడిని తగ్గించుకోవడం, మంచి నిద్ర వంటివి ఫాలో అయితే మరింత ఫాస్ట్‌గా రిజల్ట్ ఉంటుంది. అయితే, ఇప్పుడు చెప్పే టీలు మాత్రం బరువు తగ్గించే మెడిసిన్స్‌లానే పనిచేస్తాయి. మరి, అవేంటంటే,
బరువు తగ్గించే టీలు
సాధారణమైన టీలో ఎక్కువగా కేలరీలు ఉంటాయి. వీటివల్ల బరువు పెరుగుతారు. ఇతర సమస్యలొస్తాయి. అయితే, హెర్బల్ టీలు అలా కాదు. వీటిలో ఎక్కువగా కాటెచిన్స్ ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్యాట్‌ని కరిగించేస్తాయి. దీంతో ఎక్కువ కేలరీలు బర్న్ అయి జీవక్రియ పెరుగుతుంది. ఈ టీలు కాటెచిన్స్ అనే పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలని కలిగి ఉంటుంది. టీలో ముఖ్యంగా నాలుగు రకాల కాటెచిన్స్ ఉంటాయి. ఎపికాటెచిన్, ఎపిగాల్లో కాటెచిన్, ఎపిగాల్లో కాటెచిన్ గాలెట్ వంటివి ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచివి. పైగా బరువు తగ్గిస్తాయి. అలాంటి బరువు తగ్గించే టీల గురించి తెలుసుకుందాం.
ఊలాంగ్ టీ
ఊలాంగ్ టీలో పాలీ ఫెనాల్స్ ఉంటాయి. మిగతా టీల్లానే ఊలాంగ్ టీలోనూ కెఫిన్ ఉంటుంది. దీని వల్ల బరువు తగ్గుతారు. ఉదాహారణకి ఊలాంగ్ టీ తాగడం వల్ల కొవ్వు త్వరగా బర్న్ అవుతుంది. బ్రేక్‌ఫాస్ట్, లంచ్ టైమ్‌లో ఈ టీ తాగిన వారికి త్వరగా ఫ్యాట్ కరిగినట్లుగా గుర్తించారు. ఊలాంగ్ టీ ఫ్యాట్‌ని కరిగించే మెటబాలిజానికి సాయపడడం ద్వారా బరువు తగ్గుతుంది. ఉదాహారణకి రోజుకి ఊలాంగ్ టీ తాగడం వల్ల బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది.
బ్లాక్ టీ
బ్లాక్ టీ ఆకులు కూడా ఇతర టీ లీవ్స్ కంటే ఎక్కువగా ఆక్సీకరణం చెందుతాయి. చుట్టుపక్కల ఉండే గాలిని గ్రమిస్తాయి. బ్లాక్ టీలో థియాఫ్లావిన్స్‌కి మంచి మూలం. బ్లాక్ టీ ఆకులు ఆక్సీకరణం చెందినప్పుడు పాలీఫెనాల్స్ ఏర్పడతాయి. దీంతో ఈ టీ తాగితే బరువు తగ్గుతారు. అధ్యయనాల ప్రకారం 3 కప్పుల పొడి బ్లాక్ టీ తాగిన వారు తాగని వారితో పోలిస్తే బరువు తగ్గినట్లుగా తేలింది. బ్లాక్‌టీలో పాలీఫెనాల్స్ కేలరీలను తీసుకోవడాన్ని తగ్గిస్తాయి. కొవ్వులు, కార్బోహైడ్రేట్స్ శోషణని తగ్గిస్తాయి. పాలీఫెనాల్స్ ఊబకాయంతో పోరాడే విధంగా, గట్ బ్యాక్టీరియాని మారుస్తాయి. బ్లాక్ టీ తీసుకోవడం వల్ల చాలా వరకూ బరువు తగ్గుతారు. బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది.
గ్రీన్ టీ
గ్రీన్ టీ లైట్‌గా చేదుగా ఉండే టీ. 10 సంవత్సరాలకి పైగా రోజుకి 2 కప్పుల గ్రీన్ టీ తాగేవారు తాగని వారితో పోలిస్తే బెల్లీ ఫ్యాట్ తగ్గడమే కాకుండా బరువు కూడా తగ్గించుకున్నారని తేలింది. గ్రీన్ టీలో కేలరీలని బర్న్ చేసే గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా గ్రీన్‌టీలోని EGCG, కెఫిన్ కొవ్వు కణాలను కరిగించేస్తాయి. మరో అధ్యయనంలో 300 మిల్లీగ్రాముల EGCG సప్లిమెంట్స్ రూపంలో మూడురోజుల పాటు తీసుకోవడం వల్ల కొవ్వు ఆక్సీకరణ పెరిగిందని అంటే కొవ్వు ఆమ్లాలను విచ్ఛిన్నం చేసే ప్రక్రియ పెరిగిందని తేలింది. కాబట్టి, ఈటీని తాగితే బాడీలోని కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గ్రీన్ టీలోని కాటెచిన్స్ కొవ్వుని కరిగించేస్తాయి.
అల్లం టీ
అల్లం టీని చాలా మంది దగ్గు, జలుబు వంటి సమస్యల్ని తగ్గడానికి తీసుకుంటారు. కానీ, వీటిని తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. ఆకలి కూడా కంట్రోల్ అవుతుంది. అల్లం టీ తాగడం వల్ల స్నాక్స్ తినాలనే కోరిక తగ్గుతుంది. దీంతో పాటు ఎక్కువగా తిన్నప్పుడు బ్లోటింగ్ వంటి సమస్యలు రావు. దీనికోసం కప్పున్నర నీటిలో ఓ అంగుళం ముక్క అల్లాన్ని వేసి 5 నిమిషాలు మరిగించాలి. తర్వాత అందులో మీకు నచ్చితే నిమ్మరసాన్ని కలిపి తాగాలి. ఇది లంచ్ , డిన్నర్ తర్వాత తాగితే మంచిది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa