అత్తా కోడళ్ల మధ్య ఎప్పుడూ కొన్ని అభిప్రాయభేదాలు, తగాదాలు జరుగుతుండటం చూస్తుంటాం. కానీ ఓ అత్త కిడ్నీ దానం చేసి తన కోడలి ప్రాణాలు కాపాడుకుంది. ఈ ఘటన యూపీలోని ఎటాలో జరిగింది. అయితే కోడలి కిడ్నీలు దెబ్బతినడంతో ఆమె సొంత తల్లి కిడ్నీ ఇవ్వడానికి నిరాకరించారు. ఈ క్రమంలో తన కిడ్నీని దానం చేస్తానంటూ ఆమె అత్త ముందుకు వచ్చింది. 'ఆమె నాకు కోడలు కాదు, కన్న కూతురితో సమానం' అంటూ అత్త కోడలికి కిడ్నీ ఇచ్చి మానవత్వం చాటుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa