యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. 14 ఏళ్ల వయసులోనే యూత్ వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు. ఈ క్రమంలోనే మరో భారత ప్లేయర్ ఉన్ముక్త్ చాంద్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును వైభవ్ సూర్యవంశీ బుధవారం బద్దలుకొట్టాడు. ఆస్ట్రేలియా అండర్ 19 టీమ్‌తో జరిగిన వన్డేలో అతడు ఈ ఫీట్ సాధించాడు.
ప్రస్తుతం భారత అండర్ 19 జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా బుధవారం జరిగిన రెండో వన్డేలో వైభవ్ సూర్యవంశీ అదరగొట్టాడు. మెరుపు హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా సూర్యవంశీ.. 68 బంతుల్లో 70 రన్స్ స్కోరు చేశాడు. ఇందులో ఏకంగా ఆరు సిక్స్‌లు ఉండటం గమనార్హం. దీంతో మొత్తంగా యూత్ వన్డే క్రికెట్‌లో అతడు కొట్టిన సిక్సర్ల సంఖ్య 41కి చేరింది. అంతకుముందు ఈ రికార్డు ఉన్ముక్త్ చంద్ పేరిట ఉండేది. అతడు.. 38 సిక్స్‌లు కొట్టాడు. అయితే అందరికంటే తక్కువ ఇన్నింగ్స్‌లలోనే ఎక్కువ సిక్స్‌లు బాదాడు ఈ 14 ఏళ్ల ప్లేయర్.
యూత్ వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్లు ఎవరంటే..
వైభవ్ సూర్యవంశీ (భారత్) - 10 మ్యాచ్‌లు - 41 సిక్స్‌లు*
ఉన్ముక్త్ చాంద్ (భారత్) - 21 మ్యాచ్‌లు - 38 సిక్స్‌లు
జవాద్ అబ్రార్ (బంగ్లాదేశ్) - 24 మ్యాచ్‌లు - 35 సిక్స్‌లు
షాజైబ్ ఖాన్ (పాకిస్థాన్) - 24 మ్యాచ్‌లు - 31 సిక్స్‌లు
తౌహిద్ హ్రిదోయ్ (బంగ్లాదేశ్) - 47 మ్యాచ్‌లు - 30 సిక్స్‌లు
యశస్వి జైశ్వాల్ (భారత్) - 27 మ్యాచ్‌లు - 30 సిక్స్‌లు
వైభవ్ సూర్యవంశీ నెలకొల్పిన మరికొన్ని రికార్డ్‌లు
*యూత్ వన్డేల్లో 52 బంతుల్లోనే శతకం
*యూత్ వన్డేల్లో ఒకే ఇన్నింగ్స్‌లో 10 సిక్స్‌లు కొట్టిన తొలి భారత బ్యాట్
*ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ (35 బంతుల్లో) చేసిన అత్యంత పిన్న వయస్కుడు
*యూత్ టెస్టుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ (కేవలం 58 బంతుల్లో) చేసిన భారత ఆటగాడు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa