ప్రభుత్వం పదేపదే ప్రొటోకాల్ ఉల్లంఘనకు పాల్పడుతోందని మండలి వివక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. మండలి చైర్మన్‌కు జరుగుతున్న అవమానంపై ఇవాళ సభలో వైయస్ఆర్‌సీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. బిల్లులకు మేం వ్యతిరేకం కాదని, ప్రొటోకాల్ ఉల్లంఘనకు ముగింపు పలకాలని సూచించారు. మండలిలో కాఫీకి, అసెంబ్లీలో కాఫీకి తేడా ఉంటోందని, అసెంబ్లీ, మండలిలో ఒకే రకమైన కాఫీ, భోజనాలు లేవంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంపై వెంటనే ఛాంబర్ లో చర్చ పెట్టాలలని ఆయన డిమాండ్ చేశారు. ఎక్కడైనా చిన్న పొరపాట్లు జరిగితే పునరావృతం కాకుండా చూస్తామని మంత్రి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa