ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రోయ్ తవ్వకాల్లో 4,500 ఏళ్ల నాటి బంగారు ఆభరణం, పచ్చరాయి లభ్యం

international |  Suryaa Desk  | Published : Mon, Sep 29, 2025, 03:11 PM

తుర్కియేలోని ప్రాచీన నగరం ‘ట్రోయ్‌’లో పురావస్తు పరిశోధకులు చేపట్టిన తవ్వకాల్లో 4,500 ఏళ్ల క్రితం నాటి అరుదైన బంగారు ఆభరణం, విలువైన పచ్చరాయి (జేడ్‌) బయటపడ్డాయి. గత 160 ఏళ్లుగా జరుగుతున్న ఈ తవ్వకాల్లో లభించిన అత్యంత విలువైన నిధిగా దీనిని భావిస్తున్నారు. క్రీస్తుపూర్వం 2,500 ఏళ్ల నాటిదని అంచనా వేస్తున్న ఈ బంగారు ఆభరణం, కంచు యుగంలో ప్రజలు ఛాతీపై ధరించేవారని పరిశోధకులు తెలిపారు. ఈ ఆభరణంతో పాటు ఒక లోహపు పిన్ను, పచ్చరాయి కూడా లభించాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa