హిమాచల్ ప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్న ఈ వ్యక్త.. సరైన స్పెల్లింగ్‌తో చెక్ కూడా రాయలేకపోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఆ ప్రిన్సిపాల్ తన పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికులకు చెల్లించాల్సిన రూ.7, 616ను (రూపాయిల అంకెల్లో) రాశారు. కానీ ఆ అంకెలను ఇంగ్లీషు పదాల్లో రాసేటప్పుడు చేసిన ఘోరమైన స్పెల్లింగ్ తప్పులు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
ఆయన సెవెన్ థౌసండ్ సిక్ హండ్రెడ్ సిక్ట్సీన్ రూపీస్ ఓన్లీ (Seven Thousand Six Hundred Sixteen Rupees Only) అని రాయడానికి బదులుగా.. సావెన్ థర్స్‌డే సిక్స్ హరేంద్ర సీక్స్టీ (Saven Thursday Six Harendra Six Rupees Only) అని రాశారు. ఈ తప్పుల కారణంగా బ్యాంకు అధికారులు ఆ చెక్కును నగదుగా మార్చకుండా తిరస్కరించారు. తిరస్కరించిన చెక్ చిత్రాన్ని ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది విపరీతంగా వైరల్ అయింది. ఇది చూసిన నెటిజెన్లు అంతా తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి వాళ్లు ఉన్నందువల్లే తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపడానికి తల్లిదండ్రులు భయపడుతున్నారని ఒక నెటిజన్ వ్యాఖ్యానించారు. రిజర్వేషన్ల కారణంగానే ఇలాంటి వారికి ఉపాధ్యాయ ఉద్యోగాలు లభిస్తున్నాయని మరో నెటిజెన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ ఘటన ప్రభుత్వ విద్యా వ్యవస్థ నాణ్యతను, ఉపాధ్యాయుల నియామక ప్రమాణాలను ప్రశ్నించేలా ఉందని చాలామంది అభిప్రాయ పడుతున్నారు. ప్రధానోపాధ్యాయుడి పదవిలో ఉన్న ఒక వ్యక్తికి ప్రాథమిక స్పెల్లింగ్‌లు కూడా తెలియకపోవడంపై నెటిజన్లు తీవ్రంగా ఎగతాళి చేస్తున్నారు. సార్ తప్పు లేదు, పెన్ను సరిగ్గా రాయలేదేమో అంటూ ఒక నెటిజన్ వ్యంగ్యంగా స్పందించారు.
గ్రామీణ ప్రాంతాల్లో విద్య ప్రమాణాలు ఎలా ఉన్నాయో ఈ ఘటన ఒక ఉదాహరణగా నిలుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులే ఇలాంటి తప్పులు చేస్తే విద్యార్థులకు ఎలాంటి విద్యను బోధిస్తారని చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి విషయాలపై పై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa