ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆల్మ‌ట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపుతో రాయలసీమకి తీరని అన్యాయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 01, 2025, 01:34 PM

క‌ర్నాట‌క ప్ర‌భుత్వం ఆల్మ‌ట్టి ప్రాజెక్టు ఎత్తును పెంచేందుకు సిద్దమవుతున్న నేపథ్యంలోనూ, రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర హాని జరుగుతుందని తెలిసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కనీసం స్పందించకపోవడం దారుణమని వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... ఆల్మట్టి ఎత్తు పెంచడం వల్ల రాయ‌ల‌సీమ‌కు తీవ్ర అన్యాయం జ‌రుగుతుంద‌ని తెలిసి కూడా సీఎం చంద్ర‌బాబు ఎందుకు నోరు మెద‌ప‌డం లేద‌ని ప్రశ్నించారు. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ స‌మావేశాల్లో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించ‌కుండా వైయ‌స్ జ‌గ‌న్‌ని దూషించి, వ్య‌క్తిత్వ హ‌న‌నం చేయ‌డానికే వాడుకున్నార‌ని స‌తీష్‌రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. అసెంబ్లీలోని మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌, చిరంజీవి గురించి బాల‌కృష్ణ నోటికొచ్చిన‌ట్టు మాట్లాడుతుంటే అక్క‌డే ఉన్న సీఎం చంద్ర‌బాబు చోద్యం చూస్తున్నారా అని నిలదీశారు. చంద్ర‌బాబు ఉద్దేశ‌పూర్వ‌కంగానే బాల‌కృష్ణ‌తో చిరంజీవిని తిట్టించార‌ని, కాపు స‌మాజంపై త‌మ‌ విద్వేషాన్ని ప్రద‌ర్శించార‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్ర‌భుత్వానికి ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై చిత్త‌శుద్ధి ఉంటే వైయ‌స్సార్సీపీకి ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa