పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో నిరసనలు కొనసాగుతున్నాయి. ఆవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గత మూడు రోజుల నంచి పౌరులు చేస్తున్న ఆందోళనను పాక్ బలగాలు అణచిసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో నిరసనలు హింసాత్మకంగా మారాయి. బుధవారం (అక్టోబర్ 1న) పాక్ బలగాలు జరిపిన కాల్పుల్లో 10 మంది పౌరులు మృతిచెందారు. ధిర్కోట్, బాగ్ జిల్లాలో నలుగురు.. ముజఫరాబాద్, మిర్పుర్ ప్రాంతాల్లో ఇద్దరు చొప్పున మృతిచెందారు. మంగళవారం కూడా మరో ఇద్దరు చనిపోయారు. మరోవైపు, ఆందోళనలు అణగదొక్కడానికి పీఓకే పట్టణాలో పాక్ బలగాలు ఫ్లాగ్ మార్చ్‌లు చేస్తున్నాయి.
మావద్ద ప్లాన్ బీ ఉంది!
ఈ ఆందోళనలతో పీఓకేలో మార్కెట్లు, దుకాణాలు, రవాణా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. బుధవారం ఉదయం.. నిరసనకారులను అడ్డుకోవడానికి వంతెనలపై ఉంచిన పెద్ద పెద్ద కంటైనర్లపైకి ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. అనంతరం వాటిని నదిలో పడగొట్టారు. ఈ క్రమంలోనే నిరసనకారులపైకి బలగాలు కాల్పులు జరిపాయి. అయితే ఇది కేవలం ప్లాన్ ఏ మాత్రమే అని.. తమ వద్ద వేరే ప్రాణాళికలు కూడా ఉన్నాయని ఏఏసీ లీడర్ షౌకత్ నవాజ్ మిర్ పాకిస్థాన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాగా, పాక్ ప్రభుత్వం భారీ స్థాయిలో సాయిధ బలగాలను దింపుతున్నా.. నిరసనలు కొనసాగుతున్నాయి.
70 ఏళ్ల అణచివేత..
రాజకీయంగా, ఆర్థికంగా పాక్ ప్రభుత్వం తమను అణగదొక్కుతోందని నిరసనకారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దీంతో గత మూడు రోలుజుగా అవామీ యాక్షన్ కమిటీ నేతృత్వంలో నిరసనలు జరుగుతున్నాయి. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లకు పైగా గడిచినా.. పీవోకేలోని తమకు ప్రాథమిక హక్కులు కూడా కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పీవోకేలో సంస్కరణలు చేపట్టాలని 38 డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని.. ‘‘షటర్-డౌన్.. వీల్-జామ్’’ పేరుతో అవామీ యాక్షన్ కమిటీ ఈ నిరసనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో భారీ నిరసనలను అణచివేయడానికి పాక్ పెద్ద ఎత్తున బలగాలను మోహరిస్తోంది. ఈ ప్రాంతంలో ఇంటర్నెట్‌ను నిలిపివేసింది.
పీఓకేలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పాకిస్థాన్ ప్రభుత్వాన్ని ఎండగట్టాలని జాయింట్ AAC ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా గురువారం లండన్‌లోని పాక్ హైకమిషన్ ఎదుట భారీ నిరసన చేపట్టాలని ప్లాన్ చేసింది. అయితే అంతకుముందు.. తమ పోరాటం ఏ సంస్థకు వ్యతిరేకంగా కాదని.. ఏఏసీ నాయకుడు షౌకత్ నవాజ్ మీర్.. ముజఫరాబాద్‌లో ప్రజలను ఉద్దేశించి అన్నాడు. 70 ఏళ్లుగా పీఓకే ప్రజలకు దక్కని ప్రాథమిక హక్కుల కోసమే ఈ పోరాటం చేస్తున్నామని పేర్కొన్నాడు. ఇప్పటివరకు జరిగింది చాలు.. హక్కులు ఇవ్వండి లేదా ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కోండి అని పాక్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa