భారత రక్షణ శాఖను బలోపేతం చేసేందుకు డీఆర్డీవో బ్రహ్మోస్ క్షిపణులను మించిన మిస్సైల్స్ తయారీ పనుల్లో నిమగ్నమైంది. 'ధ్వని' పేరుతో హైపర్ సోనిక్ గ్లైడ్ వెహికల్ పరీక్షలను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేసేందుకు అభివృద్ధి చేస్తుంది. 'ధ్వని' క్షిపణి ధ్వని వేగం కన్నా ఐదారు రెట్లు అధిక వేగంతో ప్రయాణిస్తుంది. దీని వేగం గంటకు సుమారు 7 వేల కిలోమీటర్లకు పైగా ఉంటుందని అంచనా. ప్రయాణ మార్గంలో దిశను మార్చుకోగల సామర్థ్యం కూడా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa