అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి ఈసారి నోబెల్ శాంతి బహుమతి లభిస్తుందా? అనే ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.ట్రంప్‌కి ఈ బహుమతి అందే అవకాశాలు కనిపిస్తున్నా, నిపుణుల అభిప్రాయాల ప్రకారం ఆయన ఆశలు నెరవేరేలా లేవని ప్రచారం జరుగుతోంది.నోబెల్ బహుమతుల ప్రకటన అక్టోబర్ 6 నుంచి ప్రారంభమవుతుంది. అక్టోబర్ 10న శాంతి బహుమతి ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ శాంతి బహుమతిని అందుకోలేని అవకాశాలపై 10 కీలక కారణాలు ఇవే:
1. నామినేషన్ గందరగోళం :నోబెల్ బహుమతికి నామినేషన్ గడువు జనవరి 31, 2025. ట్రంప్ మాత్రం అధికార బాధ్యతలు జనవరి 20న స్వీకరించారు.నెతన్యాహు, షాబాజ్ షరీఫ్ లాంటి నాయకులు ఆలస్యంగా ట్రంప్‌కు మద్దతుగా నామినేట్ చేసినట్లు సమాచారం ఉంది. ఇది అధికారికంగా ధృవీకరించబడలేదు.
2. యుద్ధాల విషయంలో స్పష్టతలేకపోవడం:ఏడు యుద్ధాలను ఆపినట్లు ట్రంప్ చెబుతున్నా, వాటిలో చాలావరకు ఆయన పాత్ర స్పష్టంగా రుజువుకాలేదు. ఉదాహరణకు, భారతదేశం – పాకిస్తాన్ మధ్య “ఆపరేషన్ సింధూర్” విషయంలో ఆయన జోక్యం లేదని భారత్ స్పష్టం చేసింది.
3. అర్మేనియా – అజర్‌బైజాన్ వివాదం:ఈ రెండు దేశాల మధ్య పునరావృతంగా చెలరేగిన సరిహద్దు వివాదంలో ట్రంప్ శాంతి చర్చలకు పిలిచినా, ఏ ఒప్పందం సిద్ధకాలేదు.
4. కంబోడియా – థాయిలాండ్ ఉద్రిక్తత :F-16 విమానాల వినియోగంతో ఉద్రిక్తత పెరిగినా, ట్రంప్ కృషికి భిన్నంగా శాంతికి దారి వేసింది ASEAN.
5. ఇతర సరిహద్దు వివాదాలపై అస్పష్ట హస్తక్షేపం:సెర్బియా-కొసావో, రువాండా-కాంగో, ఈజిప్ట్-ఇథియోపియా మధ్య వివాదాల్లో ట్రంప్ పాత్ర పెద్దగా లేదన్న అభిప్రాయం నిపుణులది.
6. ఇజ్రాయెల్ – పాలస్తీనా సంక్షోభం :2023 అక్టోబర్ 7న హమాస్ దాడుల నేపథ్యంలో గాజాలో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ శాంతి ప్రయత్నాలు అసమర్థంగా మిగిలాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
7. రష్యా – ఉక్రెయిన్ యుద్ధంపై పరిష్కార ప్రయత్నాల్లో విఫలం:ఉక్రెయిన్ 20% భూభాగాన్ని రష్యాకు ఇవ్వాలన్న ట్రంప్ సూచన తీవ్ర విమర్శలకు గురైంది. ఇది శాంతి సూత్రాలకు విరుద్ధంగా భావిస్తున్నారు.
8. అమెరికాలో వివాదాస్పద నిర్ణయాలు :డెమొక్రాటిక్ రాష్ట్రాల్లో నేషనల్ గార్డ్ మోహరించడం, హార్వర్డ్ వంటి విశ్వవిద్యాలయాలకు నిధుల నిలిపివేత వంటి చర్యలు ట్రంప్ అభ్యర్థిత్వాన్ని బలహీనతరం చేశాయి.
9. విలక్షణ వైఖరి & అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు:వాతావరణ మార్పును “మోసం” అని పిలవడం, ఐక్యరాజ్యసమితి, బ్రిక్స్‌లపై వ్యాఖ్యలు, గ్రీన్ల్యాండ్‌ను కొనాలన్న ప్రతిపాదనలు వంటి అంశాలు ట్రంప్‌కు శాంతి బహుమతి ఇవ్వాల్సిన పరిగణనలో ప్రతికూలతలు తెచ్చాయి.
10. బహిరంగ బెదిరింపుల వ్యాఖ్యలు:నోబెల్ బహుమతి రాకపోతే అది అమెరికాకు అవమానం అన్న ట్రంప్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. శాంతి బహుమతి విలువలను విస్మరించినట్టుగా ఇది భావించబడుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa