4G నెట్‌వర్క్ ప్రారంభించిన BSNL, ఇప్పుడు 5G సేవలను కూడా అందుబాటులోకి తీసుకురానుంది. కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ విషయాన్ని వెల్లడించారు. భారతదేశం తన సొంత 4G టెక్నాలజీతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని, రాబోయే ఆరు నుండి ఎనిమిది నెలల్లో అన్ని BSNL 4G టవర్లను 5Gకి అప్‌గ్రేడ్ చేస్తామని ఆయన తెలిపారు. ఈ సంవత్సరం చివరి నాటికి ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాల్లో BSNL 5G సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా విస్తరిస్తుందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa