యూపీలోని ఫరూఖాబాద్‌లో గురువారం తృటిలో పెను విమాన ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన వెంటనే ఒక ప్రైవేట్ జెట్ కుప్పకూలి, రన్‌వే పక్కన ఉన్న చెట్లలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో విమానంలోని పైలట్లు, ప్రయాణికులు అంతా సురక్షితంగా బయటపడ్డారు. దీంతో పెను విషాదం తప్పినట్లయింది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa