భారత్– వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు కుల్ దీప్ యాదవ్ ధాటికి విండీస్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఢిల్లీ పిచ్ స్పిన్ కు అనుకూలంగా మారడంతో కుల్ దీప్ రెచ్చిపోయాడు. కేవలం 82 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. దీంతో వెస్టిండీస్ ‘ఫాలో ఆన్’లో పడింది. ఓవర్‌నైట్ 140/4 స్కోరుతో ఆట ప్రారంభించిన విండీస్.. కుల్‌దీప్ యాదవ్ దెబ్బకు కుదేలైంది. మూడోరోజు 248 పరుగులకే ఆలౌటైంది. భారత జట్టు తొలి ఇన్నింగ్స్ ను 518/5 స్కోరు వద్ద డిక్లేర్ చేయడంతో.. 270 పరుగులు వెనకబడిన విండీస్ ఫాలో ఆన్ ఆడుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa