ట్రెండింగ్
Epaper    English    தமிழ்

1 బిలియన్‌ ఐపీఓకు హిందుస్థాన్‌ కోకాకోలా బేవరేజెస్‌!

business |  Suryaa Desk  | Published : Fri, Oct 17, 2025, 08:04 PM

ప్రముఖ శీతలపానీయాల సంస్థ కోకాకోలా, తన భారత బాటిలింగ్‌ యూనిట్‌ హిందుస్థాన్‌ కోకాకోలా బేవరేజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను పబ్లిక్‌ ఇష్యూ (IPO)కు తీసుకురావాలని యోచిస్తోంది. మార్కెట్ నుంచి సుమారు 1 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.8వేల కోట్లు) సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయంపై సంస్థ బ్యాంకర్లతో చర్చలు జరుపుతున్నట్లు బ్లూమ్‌బెర్గ్‌ వార్తా సంస్థ నివేదించింది. ఈ చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని, బ్యాంకర్ల నియామకం పూర్తి కాలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. అన్నీ అనుకూలిస్తే వచ్చే ఏడాది ఈ IPO వచ్చే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa