ప్రైమ్ మెంబర్‌షిప్ రద్దులో వినియోగదారులకు ఇబ్బందులు కలిగించిన ఆరోపణలపై అమెజాన్ సుమారు 2.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 22 వేల కోట్లు) చెల్లించేందుకు సెటిల్మెంట్ కు అంగీకరించింది. ఫెడరల్ ట్రేడ్ కమిషన్ దర్యాప్తు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. జూన్ 23, 2019 నుండి జూన్ 23, 2025 మధ్య ప్రైమ్ కోసం సైన్ అప్ చేసి, సభ్యత్వాన్ని రద్దు చేసుకోవడంలో ఇబ్బంది పడిన వినియోగదారులకు ఈ డబ్బును జరిమానా రూపంలో చెల్లించనుంది. అర్హత కలిగిన కస్టమర్లకు ఆటోమేటిక్ గా $51 (రూ. 4990) చెల్లింపులు జరుగుతాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa