AP: కూటమిలో భీమవరం డీఎస్పీ జయసూర్య పేకాట పంచాయితీ చిచ్చురేపుతోంది. ఆయన పేకాటను ప్రోత్సహిస్తున్నారంటూ జనసేన నేతలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఫిర్యాదు చేశారు. దాంతో డీఎస్పీపై పవన్ విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలో పవన్‌కు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఝలక్ ఇచ్చారు. ‘వారానికి 5 రోజులు ఇక్కడే ఉంటున్నా. డీఎస్పీ జయసూర్యపై నాకు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. నాకున్న సమాచారం మేరకే మాట్లాడాను. నేనేం ఆయనకు సపోర్టు చేయడం లేదు. డీఎస్పీపై విచారణ జరుగుతోంది’ అని రఘురామ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa