పన్ను లేకుండా దుబాయ్ నుంచి ఎంత బంగారం తెచ్చుకోవచ్చని నెట్టింట చర్చ జరుగుతోంది. అయితే, దీనికి కొన్ని నియమాలున్నాయి. కస్టమ్స్ రూల్స్ ప్రకారం, మహిళలు దుబాయ్ నుంచి 40 గ్రాముల బంగారం, పురుషులు 20 గ్రాముల బంగారం తీసుకురావచ్చు. ఈ పరిమితికి మించి తీసుకువస్తే 3 నుంచి 10 శాతం వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దుబాయ్ నుంచి గోల్డ్ కొని భారత్‌కి తీసుకొస్తుంటే, కొనుగోలు రసీదు, క్వాలిటీ సర్టిఫికేట్, గోల్డ్ కాయిన్స్ లేదా బార్స్ అయితే సీరియల్ నంబర్ తప్పనిసరిగా ఉండాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa