ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గిరిజనులకు దోమ తెరలు: మంత్రి సత్యకుమార్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 27, 2025, 08:19 PM

AP: అల్లూరి, మన్యం జిల్లాల్లో మలేరియా, ఇతర జ్వరాల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ మేరకు 743 గ్రామాల్లోని గిరిజన కుటుంబాలకు 89,845 దోమతెరలను ఉచితంగా అందించనున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దీనివల్ల సుమారు 2 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని, దీనికి రూ.2.30 కోట్లు ఖర్చవుతుందని ఆయన పేర్కొన్నారు. దోమలను సంహరించే మందుతో తయారు చేసే ఈ తెరలను 4 ఏళ్ల వరకు ఉపయోగించుకోవచ్చని మంత్రి వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa