రష్యా యునైటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్ కార్పొరేషన్ (UAC) హిందుస్థాన్ ఏరోనాటిక్స్ (HAL)తో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా భారత్‌లో ఎస్‌జే-100 జెట్‌లను తయారు చేయనున్నారు. HAL ప్రకటన ప్రకారం, ఇది భారత్‌లో పూర్తి ప్రయాణికుల విమానం తయారీలో తొలిసారి. రానున్న పదేళ్లలో స్థానిక కనెక్టివిటీ కోసం ఎస్‌జే-100 వంటి 200 చిన్న విమానాలు అవసరమని, ఈ ఒప్పందం పౌర విమానయాన రంగంలో భారత్ ఆత్మనిర్భరతకు కీలకం కానుందని పేర్కొంది. ఎస్‌జే-100 అనేది 103 మంది ప్రయాణికుల సామర్థ్యం గల రెండు ఇంజిన్ల విమానం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa