చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్‌లోని బింజౌలో ఉన్న ఒక జిమ్, 3 నెలల్లో 50 కిలోలు బరువు తగ్గిన వారికి రూ.1.36 కోట్ల విలువైన పోర్స్చే కారును బహుమతిగా ఇస్తామని ప్రకటించింది. ఈ సవాలులో 30 మంది మాత్రమే పాల్గొనగలరు. ఇప్పటికే ఏడు, ఎనిమిది మంది నమోదు చేసుకున్నారు. విజేతకు ఇచ్చే కారు జిమ్ యజమానికి చెందిన పాత మోడల్ అని జిమ్ కోచ్ వాంగ్ తెలిపారు. ఈ ఆఫర్ బరువు తగ్గడానికి ప్రజలను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రారంభించబడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa