ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాశీబుగ్గలో విషాదం , ఆలయంలో తొక్కిసలాట 9మంది మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 01, 2025, 02:12 PM

కాశీబుగ్గలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఏకాదశి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలిరావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో స్పాట్ లోనే తొమ్మిది మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానిక అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa