ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గతంలో అమరావతి అనేక కష్టాలకు గురైంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 01, 2025, 02:14 PM

విట్ ఏపీ యూనివర్సిటీ 5వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ సీనియర్ డైరెక్టర్ రాజీవ్ వర్మ గౌరవ అతిథిగా, విట్ వ్యవస్థాపకులు, కులపతి జి విశ్వనాథన్ హాజరయ్యారు. స్నాతకోత్సవం సందర్భంగా చాన్సిలర్ విశ్వనాథన్‌, చీఫ్ గెస్ట్ ఎన్వీ రమణ.. విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు.  సందర్భంగా  సుప్రీంకోర్ట్ మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ మాట్లాడుతూ... ‘ఏ దేశం చూసినా ఏమున్నది గర్వకారణం’ అంటూ మహాకవి శ్రీశ్రీ చెప్పిన కవిత్వాన్ని ఆయన ప్రస్తావించారు. ‘కృష్ణా నది నాగరికతలో సామాన్య జీవితం ఎవ్వరిది... అమరావతి నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు’ అంటూ శ్రీశ్రీ కవిత్వాన్ని తనదైన శైలిలో మాజీ సీజేఐ అన్వయించారు. నాటి నిర్ణయాల వల్ల అమరావతి అనేక కష్టాలకు గురైందని తెలిపారు. కష్టకాలంలో విట్ లాంటి యూనివర్సిటీ నిలబడిందన్నారు. చుట్టప్రక్కల గ్రామాల ప్రజల స్కూలింగ్‌కు, ఆసుపత్రులకు విట్ సహకరిస్తుందని చెప్పారు. ఈ ప్రాంతం మొత్తం తనకు తెలుసని... అప్పట్లో ఎమర్జన్సీ సమయంలో కృష్ణానదిలో ఉన్న దిబ్బలపై రహస్య సమావేశాలు పెట్టుకున్నామంటూ ఆనాటి సంఘటనలను ఎన్వీ రమణ గుర్తుచేసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa